TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్‌కు స్వాగ‌తం చెప్పేందుకు వెళ్లిన రఘురామ.. అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు..

Published on: Thu Sep 9, 2021 11:32AM

నారా లోకేశ్‌ను చూసి జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు భ‌య‌ప‌డుతున్న‌ట్టుంది? ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటోంది. ఇటీవ‌ల ఏకంగా లోకేశ్‌ను అరెస్ట్ చేసి క‌క్ష్య తీర్చుకుంది. తాజాగా, నారా లోకేశ్ న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌పైనా పోలీసులు తీవ్ర ఆంక్ష‌లు విధించారు. టీడీపీ నాయ‌కుల‌ను గృహ నిర్బంధం చేశారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర పోలీసులు భారీగా మోహ‌రించారు. 

ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. టీడీపీ నాయ‌కుల‌ను, లోకేశ్‌కు మ‌ద్దతు తెలిపేందుకు వ‌స్తున్న వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఖాకీలు క‌ట్ట‌డి చేస్తున్నారు. 

ఇక‌, గన్నవరం ఎయిర్ పోర్టులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు బయలు దేరిన టీయన్‌టియుసి అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజును పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో రఘురామ‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు తీరుపై రాఘురామ‌రాజు తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.