TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

"జై భీమ్" మూవీతో పోల్చుకున్న ర‌ఘురామ‌.. ఆ సీన్ ఏంటంటే..

Published on: Fri Nov 5, 2021 5:06PM

క‌రెంట్ ఇష్యూల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించే ఎంపీ ర‌ఘురామ.. తాజాగా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించి ఏపీ సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. "పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇంధనం రేట్లు, స్కూల్‌ ఫీజులు, ఇంటి పన్నులు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో సీఎం జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు అమలవుతున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టు.. యానాం, కర్ణాటక, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఏపీ కంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరారు.. ఇప్పుడు అమలు చేసేందుకు వెనకాడుతున్నారు. ఏపీలో పెట్రో రేట్లు తగ్గించి దేశ వ్యాప్తంగా జగన్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నా". అన్నారు ర‌ఘురామ‌.  

"జై భీమ్‌ సినిమా చూశాను. 1995లో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి.. నాకు జరిగిన ఘటన.. ఒకేలా ఉన్నట్లు అనిపించింది. పరిస్థితులు పెద్దగా మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజనుడ్ని కొట్టారు.. గిరిజనుడికి దిక్కేంటని లాయర్‌ వచ్చారు. నేను ఎంపీ, ఇప్పుడు నాకే దిక్కులేదు’’ అని రఘురామ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు అమలు చేయటం లేదు? అని ప్ర‌శ్నించారు ర‌ఘురామ‌. ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపుల విషయంపై ప్రధానికి లేఖ రాశాన‌ని చెప్పారు.  ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇలా జరుగుతోందని.. మద్యం షాపుల నుంచి వచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?.. ఆ డబ్బు ఎవరికో ఇస్తున్నారు. మద్యం షాపుల నుంచి నగదు రూపేణా వసూలు చేస్తున్న దానిలో ప్రభుత్వానికి ఎంత జమ చేస్తున్నారు? తక్షణం నగదు వసూలు ఆపి డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని ఎంపీ ర‌ఘురామ‌ డిమాండ్ చేశారు.