ఏడుకొండల వెంకన్న ...రఘువీరాకు సాక్షినా?
Published on: Tue Jun 12, 2012 10:42AM
ఈ ఉప ఎన్నికల పుణ్యమా అని దేవుళ్ళకూ కష్టకాలం వచ్చేసింది. ఎందుకంటే అభ్యర్థుల హామీలకు వీరు సాక్షులవుతున్నారు. తమను ఎవరూ నమ్మకపోతే దేవుడిని సాక్షిగా చూపడం అరుదుగా జరిగే ఘటన. అయితే అభ్యర్థులూ ఈ సాక్ష్యం చూపటం లేదు. అభ్యర్థులతో పాటు ప్రచార బాధ్యతను పంచుకున్న మంత్రైనా తన మాట నిజమని నిరూపించుకోవాలనిపించిందేమో! అందుకే వేరే దారిలేక ఆ ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెబుతున్నానని మంత్రి ప్రకటించారు. పాపం మంత్రేమి చేస్తాడు ఆ దేవుడిని సాక్ష్యంగా చూపగలడే కానీ, నిరూపించలేరు కదా! అన్ని హామీలు తామే నెరవేరుస్తామని మంత్రి రఘువీరా ఏడుకొండల వాని సాక్షిగా ప్రకటించారు.


