TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో భారతీయులపై ఆగని దాడులు

Published on: Mon Feb 27, 2017 9:59AM

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిబోట్లను దుండగులు కాల్చిచంపిన ఘటన అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనను మరచిపోకముందే మరో భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటి గోడలపై కోడిగుడ్లు విసరడం, కుక్కల అశుద్ధం పూసి, విద్వేష వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు అంటించారు. గోధుమ రంగు చర్మం వాళ్లు లేదా భారతీయులు ఇక్కడ ఉండొద్దు అంటూ పోస్టర్లపై రాశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఒకరిద్దరి పని అయివుండదని భావిస్తున్నారు.