రాచకొండ పరిధిలో కొత్త టెక్నాలజీ అమలు

ఈరోజు నుండి రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు కొత్త టెక్నాలజీలను అమలు చేస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. డ్రోన్ టెక్నాలజీ సైనాట్ టెక్నాలజీ తెలంగాణ పోలీస్ తో ఒప్పందం కుదుర్చుకుందని, సైబరాబాద్ లో ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.  ఈరోజు నుండి రాచకొండ లో కూడా అమలు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బాలాపూర్, మౌలాలి, పహాడీ షరీఫ్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ అమలు చేసే విధంగా ఈ డ్రోన్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. 

ఆ ఏరియాలలో సాయంత్రం ఆరు తరువాత కూడా ఎవరైనా ఉంటే, షాప్స్ మూసివేయడం తో పాటు, వారందరినీ కూడా డ్రోన్ సహాయంతో అలర్ట్ చేయవచ్చునన్నారు.  వెహికల్ డిస్ ఇన్ఫెక్షన్ టెక్నాలజీ హర్ష టయోటా అందించిందని,  తమ సిబ్బంది మెడికల్ అధికారులతోపాటు క్వారంటైన్ సెంటర్స్ కు వెళ్తున్నారని, ఈ రోజు నుంచి తమ వెహికల్స్ ను డిస్ ఇన్ఫెక్షన్ టెక్నాలజీతో  ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నామని మహేష్ భగవత్ చెప్పారు.