Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేపే రేసు గుర్రం విడుదల
posted on: Dec 6, 2013 9:35AM
.jpg)
"ఇద్దరమ్మాయిలతో" వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత కసిగా ఉన్న అల్లు అర్జున్ తన తరువాతి చిత్రంపై బాగా నమ్మకంతో ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసు గుర్రం". ఈ సినిమాలో బన్నీ కొత్తగా కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపే(డిసెంబర్ 7) విడుదల చేయబోతున్నారు. సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేస్తున్నారు. శృతిహాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. మొదటిసారిగా బన్నీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియోను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






