Latest News
‘రభస’ ఫస్ట్ లుక్ సూపరెహె: ‘జక్కన్న’ రాజమౌళి ప్రశంస
posted on: May 20, 2014 12:33PM
.jpg)
దర్శకుడు రాజమౌళి తాను రూపొందించే సినిమాలను శిల్పం చెక్కినట్టు చెక్కుతూ వుంటారు. అందుకే ఆయన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. రాజమౌళికి వున్న ఈ లక్షణాన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని అమరశిల్పి జక్కనతో పోలుస్తూ ‘జక్కన్న’ అని పిలుస్తూ వుంటారు. ఆ జక్కన్న రాజమౌళి ఎన్జీఆర్ తాజా చిత్రం ‘రభస’ ఫస్ట్ లుక్‌ని ఫేస్ బుక్‌లో అభినందించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న రభస ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాణ వహిస్తోన్న ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. జూనియర్ సరసన సమంత నటిస్తోంది. సోషల్ నెట్‌వర్నింగ్ సైట్‌లలో ఇప్పటికే హల్‌చల్ చేస్తోన్న ఈ ఫస్ట్‌లుక్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పవర్‌ఫుల్ పోస్టర్‌లను రాజమౌళి ఫేస్ బుక్‌లో అభినందించారు. ''ఎన్టీఆర్‌ని ఇటువంటి పోస్టర్లలో చూసి చాలా రోజులవుతుంది'' అని ఫేస్‌బుక్‌లో పెట్టారు. జక్కన్నకి నచ్చాయంటే ఇక చెప్పేదేముంది?


.jpg)



