TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500.. సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు

Published on: Fri Jun 12, 2026 1:15PM

రెండుసార్లు ఒలింపిక్ పతకాలను అందుకున్న విజేత, తెలుగుతేజం..  పివి.సింధు, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో  సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది.   సిడ్నీలో శుక్రవారం (జూన్ 12) జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ  చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు..   సెమీస్ లో  జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.  కాగా యమగూచి క్వార్టర్ ఫైనల్ లో ఇండియాకు చెందిన   యువ క్రీడాకారిణి తన్వి శర్మపై  21-14, 21-14 తేడాతో విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది.