ఊళ్లో పెళ్లికి... కుల గజ్జి కుక్కల గోల!

 

మనం తాగే కూల్ డ్రింక్ ఏ కులం వాడు బాటిల్ లో నింపాడు? మనకవసరం లేదు! దాహం తీరితే చాలు...
మనం తినే బిర్యానీ ఏ కులం వాడు ప్యాక్ చేశాడు? మనకవసరం లేదు! కడుపు నిండితే చాలు...
పూసర్ల వెంకట సింధు మెడల్ కొట్టింది! వెంటనే, కొందరు లంజాకొడుకులకి మాత్రం ఆమె కులం కావాలి!
ఛీఛీ... ఇదేం బూతు పదాల దౌర్జన్యం అంటారా? అంతే మరి... దేనికైనా ఓ హద్దు వుంటుంది! ప్రతీ దానికి కులం కావాలి అంటే ఎలాంటి వాడికైనా ఒళ్లు మండిపోతుంది. ఈ మధ్యే సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ చక్కర్లు కొట్టింది! వాడెవడికో తమ కులం వాళ్ల రక్తమే కావాలట! అదీ మూడేళ్ల పాపాయిని బతికించుకోటానికి. ఇంతకన్నా బలుపు ఫలానా అంగంలో ఎవడికైనా వుంటుందా?  ఇతర కులాల వాళ్ల రక్తం ఆ గాడిద కొడుక్కి వద్దట!

 


మీరనొచ్చు... ఆ ఫలాన కులం వారి రక్తమే కావాలని పెట్టిన పోస్టు ఒట్టి ఫేక్ పోస్టు మాత్రమే అని. అది నిజం కాకపోవచ్చు. కాని, అది రేపిన దుమారం ఎంతో అందరికీ తెలిసిందేగా? పైగా రక్తానికి కూడా కులం కంపుకొట్టించిన ఆ ట్విట్టర్ పోస్టుకి లైక్స్ కూడా వచ్చాయి. అలా లైక్ లు కొట్టిన వెధవల్ని ఏమనాలి? ఒకవేళ అదే పోస్టు నిజమై... ఆ పిచ్చి పిండంగాడు తన కులం వాళ్ల రక్తం దొరక్క... మూడేళ్ల పసి ప్రాణాన్ని బలిపెడితే? ఎవడు ఆ నష్టాన్ని పూరిస్తాడు? కాని, ఇంకా మన ఖర్మలు సంకనాకి పోక పోవటం వల్ల... ఆ పోస్ట్ నిజం కాదు, ఆ పసి పాపకు రక్తం అవసరం అన్నది కూడా నిజం కాదు! అదే మనమున్న ఈ కులాల కంపుగొట్టు సమాజంలో సంతోషకర విషయం...


ఇప్పుడే కాదు గతంలోనూ కులాల్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేసిన దొంగ నా కొడుకులు చాలా మందే వున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ, పవన్ కళ్యాణ్ , పరిటాల రవి గొడవ! అది నిజంగా జరిగిందనే దానికి ఒక్క సాక్ష్యమూ లేదు. కాని, ఇలానే కొందరు కుల గజ్జిగాళ్లు కళ్యాణ్, రవిల మధ్య గొడవ సృష్టించి, ఆయన పవర్ స్టార్ కి గుండుకొట్టించాడని వదంతలు పుట్టించి గులానందం తీర్చుకున్నారు. చివరకు, అది రెండు కులాల మధ్య యుద్ధంగా మారేదాకా పోయింది.

సరే.... ఇక ఇప్పుడు ఫేక్ నుంచి రియల్ కే వద్దాం. పీవీ సింధు అక్కడ రియోలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ, గోవా నుంచి గౌహతి వరకూ వున్న ఇంత పెద్ద ఇండియా కోసం బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టి ఫైనల్ ఆడుతుంటే ఇక్కడ మన కుల గజ్జి కుక్కలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇంకేం చేస్తుంటాయి.... ఏ కులం వాడు కనుక్కున్నాడో తెలియని టెక్నాలజీ ఉపయోగించి.... తమ వంకర తోకల్ని ఆడిస్తూ... సింధు క్యాస్ట్, పూసర్ల క్యాస్ట్, పూసర్ల వెంకట సింధు క్యాస్ట్ అంటూ సెర్చ్ లు చేయటం మొదలుపెట్టాయి! అంటే... స్వర్ణమో, సిల్వరో ఏది తెచ్చినా తమ కులం అమ్మాయే సాధించిందంటూ... మొరగుదామని ఈ కుక్కల ప్రయత్నం!

 

పాపం తెలిసో, తెలియకో కులం గురించి వెదికారు వదిలేయండి. ఎందుకని బూతులు తిడతారు అని మాత్రం మీరు అనకండి. ఎందుకంటే, ఈ కుల ఉగ్రవాదులు మానవ బాంబుల కంటే ప్రమాదకరం. ఈ ఊర పందులు తమ హీరో సినిమా రిలీజ్ రోజు థియేటర్ల ముందు నానా వేషాలు వేస్తారు. అదేదో వీళ్ల హీరో కేవలం వీళ్ల గురించే సినిమా తీసినట్టు, ఇతర కులాల్ని ఆయనగారు అస్సలు పట్టించుకోరన్నట్టు. కాని, అన్ని కులాల వాళ్లు తమ కులం హీరో సినిమా చూస్తేనే హిట్ అవుతుందని అర్థం కాదు ఈ ఎబ్రాసులకి. అంతే కాదు, వీళ్ల కుల పిచ్చి తమ తమ ఊళ్ల నుంచి హైద్రాబాదుకి, అక్కడ్నుంచి అమెరికాకి కూడా తీసుకుపోయారు తమ వెంట. అందుకే, అక్కడ కూడా ఎవడి కులం వారు తమ తమ కులానికి ఓ సంస్థ స్థాపించుకున్నారు. వెదికి వెదికి తమ కులం సెలబ్రిటీలకే సత్కారం చేస్తుంటారు! దీన్నే సంస్కృతంలో స్వకుచ మర్దనం అంటారు! పచ్చి తెలుగులో ఏమంటారో నేను వివరించను లెండీ... భయపడకండి!

 

అమలపురం నుంచి అమెరికా దాకా తీసుకుపోయిన తమ కుల గజ్జి సింధు పతకం కొట్టే టైంలో పతాక స్థాయికి చేరుకుంది! ఒకేసారి లక్షల మంది గూగుల్ మీద పడ్డారు ఆమె కులం కోసమని! ఇందులో కుట్ర వుంది, బొంగు, బోషాణం అని ఎన్ని మాటలు చెప్పినా... నిజంగా ఆమె క్యాస్ట్ గురించి వెదికిన 'కమ్మ'టి సత్యం ఎవ్వరూ కాదనలేనిది. గూగుల్ అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్ 'కాపు' కాస్తూనే వున్నాయి. పైగా ఈసారి కేవలం వెజిటేరియన్ ఫుడ్డు తినే ఓ 'ఓసీ కులం' వాళ్లు కూడా సింధు సక్సెస్ పై కర్చీఫ్ వేసే ప్రయత్నం చేశారు. ఆమె తమ కులం బిడ్డేనంటూ ఫేస్ బుక్ నిండా పోస్టులు పెట్టి గబ్బు లేపారు! అసలు ఆమె చిన్న, చితకా టోర్నమెంట్లు ఆడుతున్నప్పుడు ఈ దౌర్భాగ్యులు పట్టించుకుకన్న పాపాన పోలేదు. ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు సింధుని గుర్తించిన దిక్కులేదు. కాని, ఒలంపిక్స్ మెడల్ సాదించే సరికి సదరు కులోన్మాదులంతా రొట్టె ముక్క కోసం వెంటపడ్డ కుక్కల్లా సెర్సింగ్ లు మొదలు పెట్టారు.

 

ఏమైతేనేం భారతీయ కులానికి చెందిన మనందరి సింధు... పతకం తెచ్చింది. అన్ని కులాల వాళ్లు ఆమెకు జరిగిన రెండు రాష్ట్రాల్లోని సన్మానం ..... ఏ కులం వాడు తయారు చేశాడో తెలియని టీవీల్లో కళ్లప్పగించి చూశారు! మరి ఇంత మాత్రం దానికి దేశాన్ని రెండడుగులు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి తీసుకెళ్లే కులం సెర్చ్ లు ఎందుకు? ఇప్పటికైనా సింధు సక్సెస్ లోంచి ఇన్ స్పిరేషన్ సెర్చ్ చేద్దాం. అంతే కాని, ఆమె క్యాస్ట్ ని కాదు! అయినా కూడా కొందరుంటారు కదా.... కులం పట్టుకుని వేళ్లాడే వాళ్లు అంటారా? ఖచ్చితంగా వుంటారు... వాళ్లు...

ఇవాళ్ల తిన్నది రేపొద్దున్న శరీరంలోంచి బయటకు వచ్చేస్తుంది కదా... దాని లాంటి వాళ్లు!ఆ కుల గబ్బుగాళ్లు మీకు ఎదురైతే... అమాంతం 'ప్లష్' చేసి పారేయండి... డ్రైనేజీలో కొట్టుకుపోతారు! పీడ పోతుంది....