TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వర్ణ సింధు

Published on: Mon Aug 8, 2022 3:35PM

కామన్ వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం సింధు స్వర్ణ పతకంతో  మెరిసింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కెనడాకు చెందిన మిచెల్లీ లీతో సోమవారం (ఆగస్టు 8) జరిగిన ఫైనల్స్ లో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.

పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్స్ లో సింధు 21-15, 21-13తో మిచెల్లీ లీని చిత్తు చేసిన సింధు పసిడి పతకం కైవసం చేసుకుంది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం పక్కా అనుకున్న ఈవెంట్లలో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఒకటి.  

సింధు కామన్ వెల్త్ సింగిల్స్ లో స్వర్ణం సాధించాలని యావద్దేశం ఆకాంక్షించింది. ఆ ఆకాంక్షలను నిజం చేస్తూ సింధు స్వర్ణం సాధించింది విశ్వసించింది. కామన్వెల్త్ గేమ్స్ లో సింధు స్వర్ణం సాధించడం ఇదే మొదటి సారి.