TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింధుపై "రీజనల్" ఎఫెక్ట్...

Published on: Fri Aug 19, 2016 6:30PM

ఒక్కసారి రెండేళ్లు వెనక్కి వెళ్లి తెలుగు వారి పరిస్థితి గుర్తుకు తెచ్చుకోండి! సోనియా నివాసం టెన్ జన్ పథ్ మొదలు భారత పార్లమెంట్ దాకా ఎక్కడ చూసినా తెలుగు వారి గోలే వుండేది! విభజన కావాలని, వద్దని రెండు వర్గాలుగా చీలి ఢిల్లీని గిల్లి గిల్లి వదిలేశారు! చివరకు, రెండు ముక్కలైంది తెలుగు నేల...    రాష్ట్ర విభజనని పాజిటివ్ గా చూసిన వారు ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాలు అన్నారు! నెగటివ్ గా తీసుకున్న వారు తెలుగు జాతి విడిపోయిందని వాపోయారు. అయితే, విభజన ఎఫెక్ట్ ఇప్పటికీ తగ్గినట్టు లేదు జనాల్లో!


    సింధు ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిచే అవకాశం అందిపుచ్చుకోవటంతో సోషల్ మీడియా యాజ్ యూజ్ వల్ గా వెర్రెత్తిపోయింది. పోస్ట్ లు, షేర్లు అమాంతం ముంచెత్తాయి. అయితే, అందులో విశేషం ఏం లేదుగాని సింధు తెలుగమ్మాయి అవ్వటమే అసలు సమస్యకి కారణమైంది. తెలంగాణ వీరాభిమానులు ఆమె బోనం ఎత్తుకున్న ఫోటో చూపిస్తూ సింధు తెలంగాణ తేజం అన్నారు. అటు ఆంద్రా నెటిజన్లు కూడా సింధు ఆంధ్ర ఆణిముత్యం అంటూ ఆమె స్వగ్రామం, పుట్టుపూర్వోత్తరాలు రాసేయటం మొదలు పెట్టారు. మొత్తానికి మంచి ఊపులో వున్న బ్యాడ్మింటన్ స్టార్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం ఇరువైపులా చేశారు!


    సింధు ఆంద్రా పడుచా, తెలంగాణ బిడ్డా అన్నది పక్కన పెడితే ఆమె నిస్సందేహంగా భారతీయురాలు. కాబట్టి అందరికీ గర్వకారణం. కాని, రాష్ట్ర విభజన జరిగిన తొలి 5ఏళ్ల కాలంలో వున్న మనం సహజంగానే కాస్త ఎఫెక్ట్ అవుతాం. అదే జరుగుతోంది సోషల్ మీడియాలోనూ! అయితే, ఈ తెలంగాణ, ఆంద్ర ఫీలింగ్స్ హద్దులు దాటకపోతే అదే పదివేలు!