పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్..
Published on: Mon Mar 6, 2017 11:16AM
.jpg)
ఒలింపిక్స్ లో పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ పీవీ సింధుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ నరసింహన్ కూడా ప్రకటన చేశారు. ఈరోజు అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. దీనిలో భాగంగానే సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పోస్టును తీసుకునేందుకు ఆమె అంగీకరించారని సింధూ ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పొగిడారు. రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు.


