ట్రంప్ మాస్క్ పెట్టాడు.. మీరు కూడా పెట్టండి సారూ

కొద్ది రోజుల క్రితం ఎపి సీఎం సలహాదారుల బాధ్యతలలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ముఖ్య సలహాదారులుగా ఉన్న కల్లం అజేయ రెడ్డి, పీవీ రమేష్ కు ఉన్న అధికారాలను కట్ చేసి సీఎం ఓ లోని ప్రవీణ్ ప్రకాష్ తదితర అధికారులకు అప్పగించారు. మళ్ళీ ఏమైందో ఏమో మొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటనలో అజేయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలహాదారుగా ఉన్న అజేయ్ అధికారాలలో ఎటువంటి మార్పు లేదని కేవలం పీవీ రమేష్ అధికారులలో మాత్రమే కోత పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ తాజా ట్వీట్ ఎపి రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎపుడు మాస్క్ పెట్టని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితం మాస్క్ తో దర్సనమిచ్చాడు. దీనిని ఉదాహరణ గా చూపిస్తూ ప్రపంచంలోని నాయకులందరూ మాస్క్ లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రమేష్ ట్వీట్ చేసారు. ఐతే సీఎం జగన్ ను ఉద్దేశించి రమేష్ ఈ ట్వీట్స్ చేసారా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఎపి సీఎం కూడా చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మాస్క్ ధరించి కనిపించారు.