TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మానుష్యంగా మారుతున్న పుట్టపర్తి

Published on: Sat Mar 31, 2012 7:26AM

ఒకప్పుడు సత్యసాయిబాబా స్పర్శతో కళకళలాడిన పుట్టపర్తి నేడు వెలవెలబోతోంది. పర్యాటకులు లేక భక్తులు రాక పుట్టపర్తి అంతా నిర్మానుష్యంగా తయారైంది. బాబా నిష్క్రమణ తరువాత ఇక్కడ జనజీవనం దాదాపు స్ధంభించిందనే చెప్పాలి. బాబా లేకపోవడంతో వ్యాపారాలు పడిపోయి వ్యాపారస్థులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది వ్యాపారులు తమ దుకాణాలు మూసేశారు. వందల సంఖ్యలో ఉన్న లాడ్జింగులు, హోటళ్ళు కూడా మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. పుట్టపర్తి చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారమంతా కుప్పకూలిపోయింది. ఒకప్పుడు విదేశస్థులతో కళకళలాడిన పుట్టపర్తిలో నేడు వారి జాడే కనిపించడం లేదు. బాబా జయంతి లేదా ఇతర పర్వదినాల్లో మాత్రం కొద్దిసంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో ఆర్టీసి ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. గతంలో పుట్టపర్తి విమానాశ్రయానికి తరచుగా ప్రత్యేక విమానాలు, హేలీకాఫ్టర్లు వస్తుండేవి. ఇప్పుడు వాటి శబ్దాలు ఎక్కడా వినిపించడం లేదు.