Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుష్పకు క్రికెటర్లు ఫిదా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ స్టెప్పులు..
posted on: Jan 26, 2022 12:01PM
పుష్ప ఫీవర్ ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. పుష్ప మేనరిజం, స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు. క్రికెటర్లకూ ఆ ఫీవర్ పట్టుకుంది. విదేశీ ఆటగాళ్లు సైతం పుష్పను ఫాలో అవుతుండటం ఆసక్తికరం.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో పుష్పా ట్రెండ్ నడుస్తోంది. ఓ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో ‘పుష్ప’ స్టెప్పులేయగా.. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ ఇస్లాం కూడా అదే విధంగా స్టెప్పులేసి అలరించారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ (సీవీ), ఫార్చ్యూన్ బరిషల్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఫార్చ్యూన్ బరిషల్ తరఫున ఆడుతున్న డీజే బ్రావో.. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులేస్తూ సంబరాలు చేసుకున్నాడు బ్రావో.
మరో మ్యాచ్‌లో సైతం ఇలానే జరిగింది. సన్‌రైజర్స్ బౌలర్ నజ్ముల్ ఇస్లాం వేసిన బంతికి.. బరిషల్ ఆటగాడు మహ్మదుల్లా క్యాచ్ ఔటయ్యాడు. దీంతో నజ్ముల్ తగ్గేదేలేదన్నట్టు.. పుష్ప మేనరిజంలా మెడకింద చేతులు వేసి సవాల్ చేశాడు. ఇలా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ను పుష్ప ఊపేస్తోంది.
ఇక ఇంతకుముందే టీమ్‌ఇండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లు.. పుష్ప పాటలకు స్టెప్పులేసి సందడి చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఎంతైనా పుష్పానా.. మజాకా.. తగ్గేదేలే..!!



.webp)


