TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆన్స‌ర్ రాసేదేలే.. ఎగ్జామ్ పేప‌ర్‌లో 'పుష్ప' డైలాగ్!

Published on: Fri Apr 8, 2022 11:16AM

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.. పార్ట్ 1. ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదలై.. దేశావ్యాప్తంగా.. రచ్చ రచ్చ చేసి పెట్టింది. ఎక్కడ చూసినా... ఈ సినిమా డైలాగులే.. ఎక్కడ చూసినా.. ఈ సినిమా పాటలే. చిన్న పెద్ద అని లేదు.. అందరు పుష్ప మేనియాలో మునిగిపోయారు. ఇంకా చెప్పాలంటే.. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా ఈ చిత్రం నిలబెట్టింది. 

పుష్ప మేనియాలో ఈ చిత్రం విడుదలకు ముందే విద్యార్థులు పీకల్లోతూ కురుకుపోయారు. ఆ మేనియా నేటికి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందుకు తాజా ఉదాహరణ పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పదవ తరగతి  విద్యార్థి.. సాక్షాత్తూ ఎగ్జామ్ పేపర్లో క్వచ్చన్ పేపర్‌లోని ప్రశ్నలకు జవాబులకు బదులు ఫుష్ప డైలాగ్స్ రాసి పారేశాడు. పుష్ప.. పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (రాసేదే లేదు).. అని రాశాడు. ప్రస్తుతం సదరు ఆన్సర్ షీట్ పోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఎగ్జామ్‌లో పుష్ప డైలాగ్స్ రాసిన విద్యార్థి వివరాలు అయితే తెలియరాలేదు. కానీ మనోజ్ సర్కార్ అనే ట్విటర్ యూజర్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ట్విట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి. పుష్ప ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటారంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని ఈ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మై హసేగా నహీ (నేను నవ్వేదే లేదు) అని మరో యూజర్ తన కామెంట్ పెట్టారు. టీచర్ కూడా మార్కులు వేసేది లేదంటూ మరికొందరు ప్రతిగా ట్వీట్స్ చేశారు. పుష్ప మేనియా ఇంకా తగ్గలేదు.. అల్లు అర్జున్ రేంజ్ అది.. అంటూ కొందరు తెలుగు యూజర్స్ కామెంట్స్ అయితే పెట్టారు. అయితే ఎగ్జామ్స్‌లో అలా రాసే సీన్ లేదని.. పబ్లిసిటీ కోసమే అలా చేసి ఉంటారని.. అది ఆన్సర్ షీట్ కాకపోయి ఉండొచ్చని మరికొందరు నెట్‌జన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్రం విడుదల సందర్బంగా తామందరికీ సెలవు కావాలంటూ ... విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు.. ప్రిన్సిపల్‌కు స్వయంగా లేఖ రాసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. తమ వద్ద పుష్ప సినిమా టికెట్ ఒకటి ఎక్స్ ట్రా ఉందని.. ఆ టికెట్ మీకు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సదరు లేఖలో ఆ విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ లేఖ.. ఫుష్ప 1 విడుదల సందర్బంగా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎంతైనా అల్లు అర్జున్.. అంటే ఇలాగే ఉంటారేమో.. అనే చర్చ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.