గొంతులో పూరీ ఇరుక్కుని....

Publish Date:Aug 5, 2014

 

గొంతులో పూరీ ఇరుక్కుని ఒక మహిళ మరణించింది. నిజామాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్‌లోని పోచమ్మ కాలనీలో చింతకుంట రాధ అనే మహిళ పూరీ తింటూ వుండగా పూరీ గొంతుకు అడ్డుపడింది. రాధను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే దారిలోనే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. విషాహారం కారణంగా ఆమె మరణించిందన్న అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. అయితే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూరీ గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆడకపోవడం వల్లనే ఆమె మరణించిందని తెలిపారు.

By
en-us Political News