పూరీ జగన్నాధ ఆలయంలో భారీ చోరీ?
Published on: Tue Jun 5, 2018 11:23AM

అది హిందువులు పరమపవిత్రమైన చార్‌ధామ్ ఆలయాలలో ఒకటిగా భావించే పూరీ క్షేత్రం. ఆ ఆలయంలో రత్నభండార్ అనే గది. ఆ గదిలో స్వామివారికి సంబంధించిన విలువైన నగలు చాలా ఉన్నాయని చెబుతారు. ఒక అంచనా ప్రకారం అక్కడ 125 కిలోలకు పైగా బంగారు నగలు ఉన్నాయి. కానీ ఆ గది తలుపులు తెరవడానికి మాత్రం సాధ్యం కాదు. ఎవరైనా అధికారులు ఆ గది తలుపులు తెరవమని ఆలయ కమిటీని అడిగితే.... తాళం చెవులు పోయాయని చెప్పేస్తారు. అందుకే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. తాళం చెవుల మాయం విషయంలో బాధ్యులను గుర్తించేందుకు ఓ కమిటీని నియమిస్తోంది. రత్నభండార్‌లో నగలు భారీగా చోరీకి గురయ్యాయనీ అందుకే దాని కమిటీ సభ్యులు తాళం చెవులు పోయాయని బుకాయిస్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి.


