TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ అత్తారింటికి కూడా అంతేనంటున్న పూరి

Published on: Mon Feb 3, 2014 9:20AM

 

నితిన్, ఆదాశర్మ జంటగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన "హార్ట్ ఎటాక్" చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా డివైడ్ టాక్ ను సంపాదించుకుంది. దీని గురించి పూరి మాట్లాడుతూ...ప్రతి సినిమాకు డివైడ్ టాక్ ఉంటుంది కదా. ఏ సినిమాకు డివైడ్ టాక్ రాలేదో చెప్పండి? మొన్న బ్లాక్ బస్టర్ హిట్టయిన "అత్తారింటికి దారేది" సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే మా "హార్ట్ ఎటాక్" సినిమాకు మంచి రిపోర్టులు వచ్చాయి. సినిమా బాగుందని చాలా మంది చెబుతున్నారు. కానీ కొందరు బాగోలేదని అంటున్నారు. "హార్ట్ ఎటాక్" తొలిరోజు నైజం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఎరియల్లోను కలెక్షన్లు చాలా బాగున్నాయన్నారు పూరి.