హైదరాబాద్ లో పూరి హార్ట్ ఎటాక్

posted on: Nov 9, 2013 9:34AM

 

నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హార్ట్ ఎటాక్". ఇటీవలే స్పెయిన్ లో షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ ప్రారంభించారు. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్ బ్యానర్ లో పూరి స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...