TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యాంగంలో 'ఉమ్మడి' లేదు..

Published on: Tue Dec 24, 2013 12:01PM

 

Purandeswari telangana, Purandeswari sonia gandhi, ap new capital, telangana state

 

 

రాష్ట్ర విభజన వ్యవహారం ఓ పక్క చకచకా కేంద్రం నడిపిస్తుంటే తీరుబాటుగా కేంద్రమంత్రి పురంధేశ్వరి సోనియాకు ఆగ్రహం తెప్పించని రీతిలో సుతిమెత్తని విమర్శలకు దిగారు. తెలంగాణా ముసాయిదా బిల్లు సమగ్రంగా లేదని ఆమె సోమవారం ఆరోపించారు. అసలు రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదన్నారు. కేంద్రమంత్రులు సూచించిన అంశాలకు బిల్లులో ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం కష్టమన్నారు.