చంద్రబాబుకి పురందేశ్వరి సవాల్

 

మొన్నటి వరకు పాలు నీళ్ళలా కలిసున్న టీడీపీ,బీజేపీ లు.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల ఇష్యూతో పాము, ముంగిసలా తయారయ్యాయి.. దీంతో ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ మహాధర్నాకి హాజరైన పురందేశ్వరి, చంద్రబాబు మీద విమర్శలు చేసారు.. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న బాబు, ఏపీకి చేసింది మాత్రం ఏమి లేదన్నారు.. బాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఎన్డీయే నుండి బయటికెళ్లారని.. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, ఈ అవినీతిపై సిబిఐ విచారణకు టీడీపీ సిద్ధమా? అంటూ పురందేశ్వరి సవాల్ విసిరారు.