చిన్నమ్మకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి?
Published on: Mon Jun 15, 2026 3:34PM

కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యత పెంచేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి మరో రెండు మంత్రి పదవులతో పాటు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కేటాయిస్తారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెలలో జరిగే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఏపీకి పదవులు కేటాయిస్తారంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ రాజమండ్రి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని డిప్యూటీ స్పీకర్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందాలంటే గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిన్నమ్మే డిప్యూటీ స్పీకర్ పదవికి కరెక్ట్ అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారంట. డిప్యూటీ స్పీకర్ పదవి సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్‌కు కేటాయిస్తారని భావించినా, కీలకమైన బిల్లలు ఆమోదాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పురందరేశ్వరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సైతం చిన్నమ్మ పేరు సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరికి ఆ పదవి దక్కితే, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా డిప్యూటీ స్పీకర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.


