నావల్ల టీడీపీ, బీజేపీ విడిపోయాయా...?

 

బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి టీడీపీపై మండిపడ్డారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ....  బీజేపీతో పొత్తపెట్టకుని లాభం పొందిన టీడీపీ.. ఇప్పడే అదే పార్టీపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టకుని ఎవరు లాభపడ్డారో ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్రం లెక్కలు చెప్పకుండా నిందలు వేస్తోందన్నారు. అసలు రాజధానికి ఇచ్చిన నిధుల్లో ఎంత ఖర్చుచేశారో.. చంద్రబాబు నాయుడు చెప్పలేదని పేర్కొన్నారు. అంతేకాదు...  మీ వల్లే టీడీపీ, బీజేపీ విడిపోయాయి అని టీడీపీ నేతలు అంటున్నారని ఆమెను ప్రశ్నించగా... నా వల్లే ఆ రెండు పార్టీలు విడిపోయాయని టీడీపీ నాయకులు నాముందుకు వచ్చి చెప్పగలరా అంటూ ఆమె తిరిగి ప్రశ్నించారు.