ఒకే ఒక్క బ్రాంచ్ వల్ల 13,000 కోట్ల నష్టం
Published on: Tue Jun 5, 2018 12:13PM

ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించీ, నీరవ్ మోదీ మహాశయులు దాన్ని ముంచిన తీరు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశాన్నే ఒక్క కుదుపు కుదిపేసిన ఈ స్కాం గురించి పార్లమెంటరీ కమిటీ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్‌ను ప్రశ్నించింది. ముంబైలోని బ్రాడీ హౌస్‌లో ఉన్న ఒకే ఒక్క బ్రాంచ్‌లోని ఉద్యోగుల వల్ల ఇంత నష్టం జరిగిందని ఆయన నెత్తీనోరూ బాదుకున్నారు. నేరుగా రుణాలు ఇచ్చినా ఆ స్కాం బయటపడేదనీ, కేవలం హామీ పత్రాలు ఇవ్వడం వల్లే ఇంత పెద్ద స్కాంని గుర్తించలేకపోయాం అనీ వివరించారు. డైరక్టర్‌ను ప్రశ్నించిన కమిటీలో వీరప్ప మొయిలీతో పాటు మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. మన్మోహనుల వారు ఒక్క ప్రశ్నని కూడా వేయకపోవడం గమనార్హం!


