TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ సాయం తీసుకుంటానంటున్న కెప్టెన్‌

Published on: Mon Mar 13, 2017 12:47PM

 

అకాళీదళ్‌-బీజేపీ కూటమిని మట్టికరిపించి పదేళ్ల తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ అమరీందర్‌సింగ్‌.... ఈనెల 16న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంజాబ్‌ సీఎల్పీ నేతగా ఎన్నికైన అమరీందర్‌....  ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. పదహారున ముహూర్తం ఫిక్స్‌ చేశారన్న కెప్టెన్‌.... రాజ్‌భవన్‌లోనే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు.

 

అమరీందర్‌ పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనుండటంతో మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను ఏ పదవి వరిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే సిద్ధూ పాత్రపై ఊహాగానాలు వద్దన్న కెప్టెన్‌.... రాహుల్‌‌తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

సీఎంగా బాధ్యతలు చేపట్టాక ముందుగా విద్యా ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని ప్రకటించారు అమరీందర్‌.అలాగే డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో ఎంతటి పెద్దవాళ్లున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే తమ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడబోదన్న కెప్టెన్‌.... రాష్ట్రానికి అవసరమైన ఆర్ధికసాయం కోసం మోడీ సాయం తీసుకుంటామన్నారు.