TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం..

Published on: Thu Mar 16, 2017 10:38AM

 

పంజాబ్ ఎన్నిక్లలో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాడు చేయనుంది. దీనిలో భాగంగానే ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరీందర్ సింగ్ తో పాటు మరో ఏడుగురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి వర్గంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూకు చోటు లభించింది. కాగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇంకా పలువురు కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు.