చెన్నైకి చెక్ చెప్పిన పూణే

Publish Date:Apr 15, 2013

Pune Warriors outclass CSK in big win, IPL-6 Pune Warriors beat Chennai Super Kings, Pune Warriors beat Chennai Super Kings by 24 runs

 

ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా సోమవారం ఎం.ఎ. చిదంబరం స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ X పూణే వారియర్స్ మధ్య జరిగింది. చెన్నైలో శ్రీలంక ఆటగాళ్లకు అనుమతి లేకపోవడంతో పూణే వారియర్స్ కెప్టెన్ శ్రీలంక ఆటగాడు  ఏంజిలో మాథ్యూస్ కు ఈ మ్యాచ్ లో ఆడలేదు. రాస్ టైలర్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. టాస్ గెలిసి బ్యాంటింగ్ ఎంచుకున్న పూణే వారియర్స్ కు ఓపెనర్లు ఫించ్, ఊతప్ప చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 96 జోడించారు. ఫించ్ 45 బంతుల్లో 67 పరుగులు (10 ఫోర్లు, 2సిక్సర్లు) చేసి జడేజా బౌలింగ్ లో ధోని స్టంప్ అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఊతప్ప నిదానంగా ఆడాడు 33 బంతుల్లో 26 పరుగులు (2 ఫోర్లు) చేసి మోరిస్ బౌలింగ్ లో జడేజా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. రాస్ టైలర్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు అతను కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 16 బంతుల్లో 39 పరుగులు నాటౌట్ (3ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మిగతా బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేదు. మిషెల్ మార్ష్ 2 మనీష్ పాండే 9 అభిషేక నాయర్ 0 నాటౌట్ గా నిలిచాడు. క్రిస్ మోరిస్ 2, బ్రావో 2, జడేజా 1 వికెట్లు పడగొట్టారు. పూనే వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్ అనిరుద్ధ ను భువనేశ్వర్ 0 పరుగులకే పెవిలియన్ కు పంపాడు. మరొక ఓపెనర్ మురళీ విజయ్ 22 బంతుల్లో 24 పరుగులు (2ఫోర్లు, 1సిక్సర్), బద్రీనాథ్ 26 బంతుల్లో 34 పరుగులు (4ఫోర్లు), రవీంద్ర జడేజా 22 బంతుల్లో 27 పరుగులు (1ఫోర్ 1 సిక్సర్) ఆదుకునే ప్రయత్నం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ సురేష్ రైనా 8, కెప్టెన్ ధోని 10, మోర్కెల్ 13, మోరిస్ 5 నాటౌట్, అశ్విన్ 11 నాటౌట్ చెన్నైను విజయతీరాలకు చేర్చలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లు నష్టానికి 135 పరుగులు చేసింది. భువనేశ్వర్ 2, అశోక దిండా 2, మిషెల్ మార్ష్ 2, రాహుల్ శర్మ 1 వికెట్లు తీశారు. పూణే వారియర్స్ 24 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. రాహుల్ శర్మ 4-0-24-1 ఈ మ్యాచ్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. చివర్లో రెచ్చిపోయి ఆడిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది అవార్డ్ దక్కింది.