మతం అడిగి మరీ కాల్చేశారు..
Published on: Sat Jan 23, 2016 10:38AM

కొన్ని సార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటికి అనుకోని విధంగా ప్రచారం వచ్చేస్తుంది. దీనికి రోహిత్ ఆత్మహత్య ఉదంతంమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న నేతలు సైతం ఇక్కడికి వచ్చి మరీ స్పందించి వెళుతున్నారు. అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు మహారాష్ట్రలోని పూణె లో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ విద్యార్ధికాదు అంతే తేడా. మహారాష్ట్రలోని పూణె లో ఒక కుర్రాడి మతం అడిగి.. అతను హిందువు అని చెప్పాక అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. సావన్ రాథోడ్ అతనికి 17 ఏళ్ల . ఒకరోజు ఆ కుర్రాడి దగ్గరికి ముగ్గురు కుర్రాళ్లు వచ్చి.. ఏం చేస్తున్నావని.. పేరేంటని ప్రశ్నించారని.. తన పేరు సావన్ రాథోడ్ అని చెప్పగా వారు నువ్వు హిందువా అని అడిగారని.. అవునని చెప్పడంతో తన మీద పెట్రోల్ పోసి కాల్చేశారని.. ఆస్పత్రిలో ఉన్న సావన్ రాథోడ్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీం షేక్.. జుబేర్ తండోలీ.. ఇమ్రాన్ తంబోలీ అనే యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ ముగ్గురు చెప్పేది మాత్రం భిన్నంగా ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఆ కుర్రాడు కారు బ్యాటరీలు దొంగలించాడని.. అందుకే పెట్రోల్ పోసి తగలబెట్టేశామని పోలీసులకు చెప్పినట్లుగా చెబుతున్నారు.


