TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుణె కొండచరియ: 109కి చేరిన మృతులు

Published on: Mon Aug 4, 2014 3:11PM

 

మహారాష్ట్రలోని పుణె సమీపంలోని మాలిన్ గ్రామం మీద కొండ చరియ విరిగిపడిన సంఘటనలో గ్రామం మొత్తం మట్టి కింద సమాధి అయిపోయిన విషయం తెలిసిందే. సంఘటన జరిగి ఐదు రోజులు దాటినప్పటికీ శిథిలాలను తొలగించడం పూర్తి కాలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 109 మంది మృత దేహాలను వెలికి తీశారు. కొండ చరియ మట్టి కింద ఇంకా చాలా మృతదేహాలు వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మట్టికింద కూరుకుపోయిన వారెవరూ బతికి వుండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. మట్టి కింద ఇంకా ఎన్ని మృతదేహాలు బయటపడతాయోనని అధికారులు భయపడుతున్నారు.