TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుణె కొండ చరియ ప్రమాదం.. మృతులు 70

Published on: Sat Aug 2, 2014 5:44AM

 

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మాలిన్ గ్రామంపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 70కి చేరింది. ఇప్పటి వరకూ 23 మందిని జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బలగాలు రక్షించగలిగాయి. శిథిలాల కింద ఇంకా 130 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆలయం ప్రాంగణంలో 25 మంది వరకూ స్కూలు విద్యార్థులు నిద్రిస్తున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిగానీ, కొండచరియల కింద చిక్కుకుపోయి గానీ ఉండొచ్చని భావిస్తున్నారు. విద్యార్థుల కోసం నదీ తీరం వెంబడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో సహాయక చర్యలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరం చేశారు.