పులి రాజాకు క‌రోనా వ‌స్తుందా?

అవును. వ‌స్తుంది. న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలకు చెందిన నాడియా అనే నాలుగేళ్ల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా అధికారులు ప్రకటించారు. జూపార్కు ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. 
దీంతో ఈ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
కరోనా వైరస్ తో బాధపడుతున్న పులిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇతర జంతువులకు క‌రోనా వైర‌స్ విస్త‌రించ‌కుండా  అమెరికన్ వెటర్నరీ మెడికల్  అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.