TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంగ్లాండ్ పై పుజారా దూకుడు

Published on: Fri Nov 23, 2012 4:16PM

 

Pujara century helps India, Pujara century england, Pujara century india, india england 2012

 

ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకవైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరి చేసిన పుజారా, రెండో టెస్టులో కూడా సెంచరీతో ఇండియాకి అండగా నిలిచాడు. అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో పుజారాకి మంచి సహకారం అందిస్తున్నాడు. తన వందో టెస్టు మ్యాచులో శతకం చేస్తాడని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్ అబిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పనేసర్ నాలుగు వికెట్లు, అండర్సన్ ఒకటి, స్వాన్ ఒక వికెట్ తీశారు. 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద ఆట ముగిసింది.

 

ఇండియా స్కోర్ వివరాలు : గౌతమ్ గంభీర్ : 4, సెహ్వాగ్ : 30, పుజారా (నాటౌట్) : 114, సచిన్ : 8, కోహ్లీ : 19, యువరాజ్ సింగ్: 0, కెప్టెన్ ధోనీ : 29, అశ్వీన్ (నాటౌట్) : 60, ఎక్స్‌ట్రా : 2.