TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనాగ్రహం..ధర్మాగ్రహం! జ‌గ‌న్‌రెడ్డీ త‌ట్టుకోలేవు...!!

Published on: Fri Feb 4, 2022 2:39PM

అన్నం ఉడికిందో లేదో చూసేందుకు, అన్నం మొత్తం పట్టుకుని చూడవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసి పోతుంది. ఆంద్ర ప్రదేశ్’ ప్రభుత్వ ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక  సంఘాలు నిర్వహించిన, ‘చలో ..విజయవాడ’ సక్సెస్ కూడా  అంతే. ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి, చలో విజయవాడ’  ఒక దిక అయింది. ప్రభుత్వం పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత వుందో స్పష్టం చేసింది. 

నిజానికి, గురువారం విజయవాడను ముంచెత్తింది, ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం వేదన మాత్రమే కాదు. కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన మాత్రమే కాదు, నిరుద్యోగులు, విద్యార్ధులు తమ గళాన్ని కూడా జత చేశారు. నిజానికి, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రభుత్వం పట్ల జనం గుండెల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను, ఆగ్రహాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తపరిచారు. ఒక విధంగా  తెలంగాణ ఉద్యమ సమయంలో, జరిగిన సకల జనుల సమ్మెను, ‘చలో విజయవాడ’ గుర్తుకు తెచ్చింది. అది కొన్ని వారాల పాటు జరిగితే ఇది ఒక రోజు మాత్రమే జరిగింది. అదొక్కటే తేడా, మిగిలినదంత  సేమ్... టూ... సేమ్. 

అయితే ప్రభుత్వం ఇంత జరిగినా జనాగ్రహం ఇంతలా వ్యక్తమైనా, ఒక సత్యాన్ని సత్యంగా చూసేందుకు, నిజాన్ని నిజంగా అంగీకరించేందుకు సిద్ధంగా లేక పోవడమే దురదృష్టం. ఉద్యోగ సంఘాల సారధ్యంలోని పీఆర్సీ సాధన సమితి నిర్వహించిన, చలో విజయవాడ’ ఆందోళనలో తెలుగు దేశం ఇతర ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయని ప్రభుత్వం, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం, ఆడలేక మద్దెల ఓడు, అన్నట్లుగా ప్రభుత్వం డొల్ల తనాన్ని బయట పెడుతోంది. అంతేకాదు, కళ్ళతో చూడగలిగితే, చెవులతో వినలిగితే ప్రతిపక్షాలే కాదు, స్వపక్షీయులు కూడా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ వంతు పాత్రను పోషించారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలలో కొంచెం అటూ ఇటుగా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతూనే వుంది. ఇప్పుడు, ఒక్కటై ఉగ్రరూపం దాల్చింది. ఉద్యోగ సంఘాల ఆందోళన రూపంలో వ్యక్తమైంది. అలాగని, ఉద్యోగ సంఘాలు లేద ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నపుర్వకంగా జన సమీకరణ చేసారు అనుకుంటే, అది సర్కార్  స్వాముల అజ్ఞానం లేదా అహంకారం అవుతుందే కాని మరొకటి కాదు. 

ఈ నేపధ్యంలో ప్రభుత్వం  చేసిన తప్పును తెలుసుకుని, దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడితే ఎంతో కొంత  ప్రయోజనం ఉంటుంది. అంతే కానీ, తాడేపల్లి ప్యాలెస్’లో కూర్చుని అంతా బాగుందని అనుకుంటే, చివరకు, చింతలే మిగులుతాయి.నిజానికి, ప్రభుత్వానికి సోయ ఉంటే, తమచుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు ఇదొక అవకాశం. అయితే, జగన్ రెడ్డికి ఆయన చుట్టూ ఉన్న సలహాదారులకు ఆ సోయి ఉందా, అనుమానమే.