TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబటి రాంబాబు.. బెయిలు.. జైలు!

Published on: Thu Feb 12, 2026 8:33AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిలు వచ్చినట్లు ఇలా సమాచారం రాగానే.. అలా అంబటి ట్విట్టర్ లో దాడులూ, దౌర్జన్యాలు, చెరసాలలూ వెలుగును బంధించలేవు అంటూ ఓ పోస్టు వచ్చింది. ఈ పోస్టు చూడగానే అంతా విస్మయం చెందారు. జైల్లో ఉన్న అంబటి రాంబాబు ఎలా ట్వీట్ చేశారన్నదే ఆ విస్మయం. అయితే అంబటి పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ చేసే వారెవరో ఆ పోస్టు పెట్టి ఉంటారు.

అయితే అంబటి ట్వీట్, ఆయన ఇంటి ముందు బాణ సంచ కాల్చి మరీ చేసిన సంబరాలు అన్నీ తొందరపడి ఓ కోయిలా అన్న పాటను గుర్తు చేశాయని పరిశీలకులు అంటున్నారు. అంబటికి బెయిలు మంజూరైనా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.   మరో కేసులో  ఆయనపై పీటీ వారెంట్ దాఖలైంది. మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇవ్వడంతో ఆయనను గురువారం (ఫిబ్రవరి 12)కోర్టులో హారజరు పర్చనున్నారు.  అంటే  ఆ కేసులో కూడా  బెయిల్  కోసం అంబటి పిటిషన్ దాఖలు చేసుకోవలసి ఉంటుంది. 

ఇంతకీ తాజా పీటీ వారెంట్ ఏ కేసులో అంటే.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలను నిర్వహించేవారు. అప్పుడు ఆయన  వాలంటీర్ల ద్వారా   ప్రభుత్వ లబ్దిదారుల నుంచి రూ.200 వసూలు చేసి టిక్కెట్లు అంటగట్టేవారు. ఈ అంశంపై అప్పట్లో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  వైసీపీ హయాంలోనే కేసు నమోదు అయింది.

ఇప్పుడు ఆ కేసులో  పీటీ వారెంట్  జారీ అయ్యింది.  ఈ కేసులో బెయిలు వస్తే..మరో కేసు, ఆ కేసులోనూ బెయిలొస్తే ఇంకో కేసు.. ఎందుకంటే అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 కేసులు ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటిగా పీటీ వారెంట్లు జారీ అవుతూనే ఉంటాయి. అందుకే అంబటి తొందరపడి ఒకటి రెండు కేసుల్లో బెయిలొచ్చేసిందని సంబరాలు చేసుకుంటే అభాసుపాలు అవుతారని పరిశీలకులు అంటున్నారు.