విజయవంతమైన పీఎస్ఎల్వీ-సీ40...

 

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో  పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన  పీఎస్ఎల్వీ-సీ40 తనతోపాటు 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు కాగా, మిగిలినని కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రయోగంతో భారత్  ఇప్పటికి 100 ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది.