పీఎస్ఎల్వీ-సీ31 రాకెట్ ప్రయోగం విజయవంతం
Published on: Wed Jan 20, 2016 9:25AM
.jpg)
పీఎస్ఎల్వీ-31 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ-31పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ31(పీఎస్ఎల్వీ)ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఈరోజుతో ఐదు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్ ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. త్వరలో మరో 2 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని తెలిపారు. 2016 లో ఇస్రో సాధించిన తొలి విజయం ఇది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.


