శంకరన్న కోపం,వినూత్న నిరసన
Published on: Fri Dec 23, 2011 2:21PM
హైదరాబాద్:
జౌళి శాఖ మంత్రి పి.శంకరరావు కోపంతో శుక్రవారం వినూత్నమైన తీరులో నిరసన వ్యక్తం చేశారు. తనకు ఫర్నీచర్ ఇవ్వనందుకు నిరసనగా ఆయన ఈ నిరసనకు శ్రీకాకరం చుట్టారు. తన ఛాంబర్‌లో నిర్వహిచిన సమీక్షా సమావేశం సచివాలయంలోని తన ఛాంబర్‌లో కింద కూర్చునే ఆయన విధులు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కూడా కిందనే కూర్చున్నారు. ఛాంబర్‌లో కార్పెట్ పరిచి సమీక్షా సమావేశం నిర్వహించారు.శంకరరావు ఇటీవల ఛాంబర్ మారారు. తనకు తగిన ఫర్నీచర్ ఇవ్వాలని కోరుతూ ఆయన సాధారణ పరిపాలనా శాఖ కి లేఖ రాశారు. అయితే, ఇప్పటి వరకు ఫర్నీచర్ రాలేదు. ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ కిందనే కూర్చోవాలని మంత్రి తమ శాఖ సిబ్బందిని ఆదేశించారు.తాను కిందే కూర్చుంటానని మంత్రి చెప్పారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ని కూడా సిబ్బంది ఒక గదిలో దాచివేశారు. దీంతో ఆయన ఛాంబర్‌లో కింద కార్పెట్ పరిచి సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకరరావు ఎప్పటికప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నేరుగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.


