TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరుకి స్తానం ,అభిమానుల్లో మనోధైర్యం : కోటగిరి

Published on: Sat Dec 24, 2011 8:11AM

హైదరాబాద్: పదవుల కోసం తాము ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయలేదని,అందువల్ల పార్టీని పునరుద్ధరించే అవకశాం ఉండదని  గత ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు స్పష్టం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం ఆయన  మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ సమన్వయ కమిటీ వేయడం మంచి పరిణామమని, ఇందులో చిరంజీవికి స్థానం కల్పించడం శుభసూచకమని ఆయన అన్నారు. చిరంజీవి సేవలను కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమన్వయ కమిటీలో చిరంజీవికి స్థానం కల్పించడం వల్ల అభిమానుల్లో మనోధైర్యం పెరిగిందని, అది కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మూడు ప్రాంతాలను సమతులనం చేస్తూ సమన్వయ కమిటీని వేశారని, ఇది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.