చిరుకు తంటా తెచ్చిపెట్టనున్న ఉపఎన్నికలు ..?
Published on: Thu Dec 22, 2011 1:44PM
హైదరాబాద్: గం
పెడాశలతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన వెంటనే చిరు వర్గం ఎమ్మెల్యేలకు నాలుగు మంత్రి పదవులతోపాటు చిరంజీవికి కేంద్రమంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారం సాగింది.ఐతే అది అలా కలలా సాగుతూ వస్తోందే కానీ వాస్తవ రూపాన్ని సంతరించుకోలేదు.దీంతో విలీనం చేసిన చిరంజీవికి కాలం కలసివస్తున్నట్లు కనబడటం లేదు. దీంతో పీఆర్పీ ఎమ్మెల్యేల్లో తీవ్ర నిరాశ ఆవహించినట్లు మొన్నటి అవిశ్వాస తీర్మానం సమయంలోనే బయటపడింది. ఐతే చిరు తన వర్గం ఎమ్మెల్యేలను ఎలాగోలా బతిమాలి తనదారిన నడిపించారు. పీఆర్పీ బలంతోనే కిరణ్ సర్కార్ నిలబడింది. పీఆర్పీ బలంతో ప్రాణం పోసుకున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం తిరిగి తన పాతపద్ధతినే అవలంభిస్తున్నట్లు కనబడుతోంది.
పైపెచ్చు తాజాగా జగన్ గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు సై అంటున్నారు. స్పీకర్ వేటు వేస్తే ఇక ఉపఎన్నికలే తరువాయి. ఇదే చిరుకు పెద్ద తంటా తెచ్చిపెట్టిందంటున్నారు.అదేమంటే ఉపఎన్నికల్లో నాలుగు స్థానాలను చిరంజీవి కోరినవారికి వదిలేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. దీంతో ఈ నాలుగు స్థానాలలో ఎంపిక చేసే అభ్యర్థుల గెలుపు కోసం చిరు తన భుజంపై భారం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఉపఎన్నికల్లో చిరు తన స్టామినాను చూపిస్తే మంత్రివర్గంలో చోటు ఉంటుందేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.


