TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రివర్గ విస్తరణలో చిరుకి మొండిచేయి

Published on: Sun Dec 18, 2011 4:19PM

హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీకి కాంగ్రెస్ అధిష్టానం మరోమారు మొండిచేయి చూపింది. ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్ఎల్డి అధినేత అజిత్‌ సింగ్‌కు మాత్రమే చోటు కల్పించారు. ఇది ప్రజారాజ్యం శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేశాయి.పార్టీ పెద్దలు చెప్పిన మాటల మేరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ప్రస్తుతానికి మొండి చూపడం సహజంగానే ఉన్న ఆయన అభిమానులలో నిరాశ మిగిల్చింది. దీనిపై చిరంజీవి కాస్త అసంతృప్తి చెందినట్టు వారు బహిరంగా వ్యాఖ్యానిస్తున్నారు.అయితే, ఆదివారం చేపట్టే మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి మంత్రిపదవిని కేటాయించబోరని, ఫిబ్రవరిలో జరిగే విస్తరణలో మాత్రమే కేటాయిస్తారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శనివారమే ప్రకటించారు. అయినప్పటికీ ప్రరాపా శ్రేణులు మాత్రం కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు.అదేసమయంలో అజిత్ సింగ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే సమయంలో చిరంజీవికి ఇవ్వకపోవడం తమ నేతకు కాస్త ఇబ్బందికరమేనని ప్రజారాజ్యం వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

దీనిపై చిరంజీవి తన వర్గం నేతలు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులతో చర్చించారని, ఆ మీదట వారిద్దరూ బొత్సతో బేటీ అయ్యారని, అనంతరం బొత్స జూబ్లిహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి అనునయించారని కథనాలు వస్తున్నాయి.అంతేకాకుండా, జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం వల్ల ఖాళీ అయ్యే 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింటిని తమ వర్గానికి కేటాయించాలని ప్రరాపా నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం మంత్రిపదవి దక్కక పోవడంతో ఇలాగైనా తమ పంతాన్ని నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ప్రరాపా నేతలు ఉన్నట్టు సమాచారం.