TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవి అడ్రస్ గల్లంతు: బాబు

Published on: Thu Dec 22, 2011 8:15AM

మెదక్:  సామాజికన్యాయం అంటూ వచ్చిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అడ్రస్ గల్లంతై కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.రాజీవ్ కిరణాలు ఓ బోగస్ ప్రాజెక్ట్ అని అయన  ఆరోపించారు. పోరుబాట పేరిట మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఒక రూపాయికే కిలో బియ్యం పథకం ద్వారా ప్రజలకు ముక్కిపోయిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలోని హోంశాఖ మంత్రితో తమ ప్రాణాలకు హాని ఉంద ంటూ ఓ కుటుంబం కేసు నమోదు చేయడాన్ని చూస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుస్తోందన్నారు.ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందో అన్న విషయాన్ని తేల్చుకోవడానికి ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు.