TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివాదాస్పదంగా మారిన 'గంటా' ప్రత్యూష కంపెనీ

Published on: Tue Feb 28, 2012 2:36PM

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తరువాత ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిని పొందరు. ఈయనకు ప్రత్యూష అనే కంపెనీ కూడా ఉంది. విజయవాడ సమీపాన గల భవానీ ఐలాండ్పై గంటా తన జే గంటను మోగించాలనుకున్నారు. అయితే నగరవాసులనుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అయితే గంటాకు చెందిన ఇదే ప్రత్యూష కంపెనీ ఏడాదిన్నర క్రితం విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో గ్రంధాలయ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని పిపిపి పద్దతిలో దక్కించుకుంది. ఈ కంపెనీ అక్కడ సుమారు 25 కోట్లతో 7 అంతస్థుల భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. రెండు అంతస్థుల జిల్లా గ్రంధాలయానికి ఇచ్చేందుకు మిగిలిన ఐదు అంతస్థులు వాణిజ్య అవసరాలకు ప్రత్యూష కంపెనీ వినియోగించుకొనేలా, ఇందుకు నెలకు లక్షరూపాయలు అద్దె చెల్లించేలా, ఏడాదికి ఐదు శాతం పెంచేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 2009 అక్టోబర్  26న జీవో విడుదల కాగా 2010 సెప్టెంబర్ లో స్థలాన్ని ప్రత్యూష కంపెనీకి అప్పగించడం జరిగింది. ఒప్పందం ప్రకారం 2012 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తిచేసి జిల్లా గ్రంధాలయ సంస్థకు అప్పగించాలి. అయితే ఏడాదిన్నర అయినా ప్రత్యూష కంపెనీ కేవలం ఆ స్థలాన్ని చదును చేయడం తప్ప ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నంలో తీసుకున్న స్థలంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేకపోయిన గంటా ప్రత్యూషకంపెనీ తగుదునమ్మా అంటూ భవానీ ఐలండ్ లో వేలుపెట్టడానికి ప్రయత్నిస్తోంది.