కంచ ఐలయ్య అరెస్ట్.. ఉద్రిక్తత

ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు పుస్తకాన్ని రచించి తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ప్రొ. కంచ ఐలయ్య. ఆ పుస్తకంలో తమపై చేసిన వ్యాఖ్యలపై ఐలయ్య క్షమాపణ చెప్పాలని ఆర్యవైశ్యులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం, గొల్ల కురుమ సంఘంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బహిరంగసభకు అనుమతి లేదు.. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని గొల్లకురుమ సంఘం, సీపీఎం నేతలు ప్రకటించడంతో ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కంచ ఐలయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తనను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని.. గొల్లకురుమలకు అన్యాయం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.