TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కు నో చెప్పిన సురేష్ బాబు..!!

Published on: Fri Jul 6, 2018 12:20PM

 

సురేష్ బాబు.. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు.. అయితే రీసెంట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్, సురేష్ బాబుకు ఒక ఆఫర్ ఇస్తే ఆయన సున్నితంగా నో చెప్పినట్టు తెలుస్తుంది.. రాష్ట్ర విభజన అనంతరం టాలీవుడ్ ఏపీకి తరలిపోతోంది అనుకున్నారు.. కానీ హైదరాబాద్ లోనే ఉండిపోయింది.. దీంతో కేసీఆర్ టాలీవుడ్ అభివృద్ధికి తనదైన సహాయ సహకారాలు అందించాలని చూస్తున్నారు.. దానిలో భాగంగానే సురేష్ బాబుకి ఒక ఆఫర్ ఇచ్చారు.. టాలీవుడ్ లో రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో బాగా పాపులర్ అయ్యాయి..

ఈ స్టూడియోల పేరుతో కమర్షియల్ సెంటర్స్ నిర్మించాలని కేసీఆర్ సూచించారు.. అందుకు సంబంధించిన భూమిని హైదరాబాద్ శివారులో ఇస్తామని తెలిపారట.. అయితే ఈ విషయంపై స్పందించిన సురేష్ బాబు.. రామానాయుడు స్టూడియో అనేది తమ తండ్రి కల.. స్టూడియో నిర్మించడం అంత సులువైన విషయం కాదు.. కానీ మా నాన్న ఎన్నో కష్టాలు పడి ఈ స్టూడియోని నిర్మించారని అన్నారు.. ఈ స్టూడియోని వేరే రకంగా మార్చే ఉద్దేశం లేదని, రామానాయుడు స్టూడియోని మా నాన్నకు గుర్తుగా ఎప్పటికీ ఇలాగే ఉంచుతామని సురేష్ బాబు అన్నారు.