రామానాయుడు మనవడు అభిరామ్ పై కేసు నమోదు
Published on: Fri Jan 4, 2013 2:08PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు మనవడు అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న రవి తేజ అనే ఇంజినీర్ ఇంటిపై రామానాయుడు మనవడు అభిరామ్ దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా అభిరామ్, ఇంజినీర్ రవితేజ మధ్య విభేదాలు ఉన్నాయని సమాచారం. శుక్రవారం రవితేజ కలిసిన అభిరామ్ అతని పై దాడికి పాల్పడ్డారని అంటున్నారు. అక్కడ ఉన్న పోలీసులు చెబుతున్న వినకుండా రవితేజ ఇ౦టిపై అభిరామ్ దాడి చేశారు. దీంతో ఇంజినీర్ కి గాయాలయ్యాయి. పోలీసులు అభిరామ్ పై 341, 323, 506 సెక్షన్ల కిందకేసు నమోదు చేశారు.


