బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. ఎందుకంటే?
Published on: Sat Jan 10, 2026 1:16PM
.webp)
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ నెల 19 నుంచి మహాపాదయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్ షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల వరకూ ఆయనీ మహాపాదయాత్ర చేపట్టనున్నారు.
ఇంతకీ ఆయనీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో చంద్రబాబునాయుడు స్కిల్ కేసు పేర అక్రమంగా అరెస్టైన సందర్భంలో ఆయన తిరుమల దేవుడికి మొక్కుకున్నారు. చంద్రబాబు ఆయన ఇమేజ్ కు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని కోరుకున్నారు.
ఆయన కోరుకున్నట్లే చంద్రబాబు స్కిల్ కేసులో నిర్దోషిగా తేల డంతో తన మొక్కు తీర్చుకోవడానికి షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన ప్రయాణించనున్నారు. నవంబర్ 19న ఈ పాదయాత్రను బండ్ల గణేష్ ఘనంగా ప్రారంభించనున్నారు. అటు ఆధ్మాత్మికంగానూ, ఇటు రాజకీయంగానూ కూడా అందరి దృష్టినీ ఈ పాదయాత్ర ఆకర్షించే అవకాశం ఉంది.


