మంచు లక్ష్మి వివాదం.. బెల్లంకొండ వివరణ...
Published on: Wed Aug 27, 2014 2:27PM

‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సెట్ ‘రభస’ చిత్రం కోసం వినియోగించుకున్నందుకు తనకు 58 లక్షలు ఇస్తామని చెప్పిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు ఇవ్వనంటున్నారంటూ మంచు లక్ష్మి మనుషులు మంగళవారం రాత్రి బెల్లంకొండ ఇంటిముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద బెల్లంకొండ సురేష్ వివరణ ఇచ్చారు. ‘‘గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం కాకపోవడంతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆ డబ్బులను మంచు లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాల్సిందిగా మంచు విష్ణుకు చెబితే ఆయన సరేనన్నారు. కానీ, మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతనికి తనకు లింకు పెట్టొద్దనీ, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయం? మంచు లక్ష్మి, విష్ణు ఒకే కుటుంబానికి చెందినవారు కారా?’’ అని బెల్లంకొండ సురేష్ ప్రశ్నించారు.


