TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూత

Published on: Fri Jun 5, 2026 12:47PM

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత,  సీబీఎఫ్‌సీ  మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు.  కొంతకాలంగా  కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న ఆయన నిన్న తన నివాసంలో  తుదిశ్వాస విడిచారు.  శాంతాక్రూజ్ హిందూ శ్మశాన వాటికలో  ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై నిహలానీకి నివాళులర్పించారు. హాత్‌కడి, ఇల్జామ్, ఆంఖే. షోలా ఔర్ షబ్నమ్ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన పహలాజ్ నిహలానీ, 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా  బాధ్యతలు నిర్వహించారు. నిహలానీ మృతి పట్ల ఆయన మృతి పట్ల   సీబీఎఫ్‌సీ అధికారులు, నటులు గోవిందా, చుంకీ పాండే, దర్శకుడు అనీస్ బజ్మీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.