TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సార్వత్రిక సమ్మె..సిపిఐ నారాయణ అరెస్ట్

Published on: Tue Feb 28, 2012 1:42PM

న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక బంద్ పిలుపుకు దేశవ్యాప్తంగా పాక్షిక స్పందన కనిపించింది. కొన్ని చోట్ల బ్యాంకింగ్ వ్యవస్థలు, రవాణా రంగం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో బస్సులు తక్కువగానే రోడ్డెక్కాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మాత్రం చాలావరకు తెరుచుకున్నాయి. బంద్ పాటిస్తే సర్వీస్ బ్రేక్ గా ట్రీట్ చేస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కోల్ కతాలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని డిజిపి చెప్పారు. కొన్ని అరెస్టులు మినహా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని చెప్పారు.

బంద్ ప్రభావం కేరళలో కనిపించింది. అక్కడ బస్సులు రోడ్డెక్కలేదు. కాగా కేరళలో అధికారంలో ఉన్న యుడిఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో నో వర్క్ నో పే ఆర్డర్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో అధికారులు సమ్మెలో పాల్గొనకుండా ఒప్పించారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లోను బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది. హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాఘవులు తదితరులు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమ్మెతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని హెచ్చరించాయి.